Sunday, November 3, 2013

Bali king,Mahabali , మహాబలిల్,బలి చక్రవర్తి




భారతదేశవ్యాప్తంగా పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆశ్వయుజ మాసంలో వస్తుంది. మెదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి.

మహా బలికి స్వాగతం 'ఓనం'
చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళకు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా మరియు సిరిసంపదలతో ఉన్నారు మరియు ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. తన సుగుణములన్నింటితోపాటు, మహాబలికి ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ, మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి, తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు.
బలి చక్రవర్తి  ఏడాదికోమారు భూలోకానికి వచ్చి, తన ప్రజలందరి యోగక్షేమాలు తెలుసుకుంటాడని జన విశ్వాసం. కేరళలో బలి ఆగమనానికి గుర్తుగా 'ఓనం' పండుగ జరుపుకుంటారు. మలయాళీయుల పంచాంగం ప్రకారం తొలిమాసమైన 'చింగం (ఆగస్టు-సెప్టెంబర్‌ల నడుమ)'లో ఓనం వస్తుంది. ఈ పండుగ పదిరోజులపాటు కొనసాగుతుంది. చిక్కని పువ్వుల రంగవల్లులు,  పసందైన విందు భోజనం, కొత్త బట్టలు, ఆటపాటల కోలాహలంతో ఈ పదిరోజులు కేరళ అంతా సందడిగా ఉంటుంది. దేశ విదేశాల్లో ఉన్న మలయాళీయులుసైతం తమ తమ ప్రాంతాల్లోనే ఈ పండుగ జరుపుకుంటారు.

అహంకారాన్ని అణచిన త్రివిక్రముడు
పురాణకథనాల ప్రకారం, బలి చక్రవర్తి రాక్షసుడైనప్పటికీ జనరంజకంగా పాలించేవాడు. మహాదాత. ఆయన పాలనలో జనులు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించేవారు. అయితే బలికి అహంకారం పెరగసాగింది. స్వర్గాధిపత్యం సాధించి ఇంద్ర పదవి పొందాలన్న ఆశతో మహా క్రతువు తలపెట్టాడు. అర్హతలేకుండా అందలం ఆశించడంతో శ్రీమహావిష్ణువు వామనావతారం దాల్చి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. క్రతువు జరుగుతుండగా యాగశాలకు వటువు రూపంలో విష్ణుమూర్తి వచ్చి, మూడడుగులు దానమడుగుతాడు. కులగురువైన శుక్రాచార్యుడు అడ్డుకున్నప్పటికీ బలి చక్రవర్తి దానం ఇవ్వడానికే సిద్ధపడతాడు.
దానం అందుకోగానే వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా భూమ్యాకాశాలను రెండు అడుగులతో ఆక్రమిస్తాడు. మూడో అడుగు ఎక్కడ మోపాలని అడగ్గా, తన శిరస్సు చూపుతాడు బలి. విష్ణువు ఆ విధంగా బలిని పాతాళానికి పంపుతాడు. అయితే బలి చక్రవర్తి పాలనాపరంగా పుణ్యాత్ముడు కావడంతో అతనినే పాతాళ చక్రవర్తిగా నియమిస్తాడు. ఏడాదికోమారు భూమిపైకి వచ్చి తన ప్రజలను పలకరించే వరాన్నికూడా ప్రసాదించాడు విష్ణుమూర్తి. అలాగే బలి ఆశించినట్టుగానే అతనికి  ఇంద్ర పదవి దక్కే అవకాశాన్ని ఎనిమిదో మన్వంతరంలో కల్పించాడు.

పసందైన ఓనసద్య
మహాబలి భూమికి వచ్చే పర్వదినాలే ఓనం. ఓనంకు పది రోజుల ముందునుంచే కేరళలోని ప్రతి ముంగిలి రంగవల్లులతో కళకళలాడడం  అనవాయితీ. బలి చక్రవర్తిని ఆహ్వానించడంలో భాగంగా 'ఓనపూక్కలం' పేరుతో పువ్వులతో రంగోలి అమరుస్తారు. బలి ప్రతి ఇంటికీ వచ్చి యోగక్షేమాలు కనుక్కుంటాడని ప్రజల నమ్మకం. తిరుఓనం నాడు 11 నుంచి 13 రకాల ఆహార పదార్థాలతో అరటి ఆకులలో  'ఓనసద్య విందు' చేస్తారు.

త్రివిక్రముడికి ప్రత్యేక పూజలు
ఓనం రోజులలో కేరళలోని త్రిక్కకరలోగల వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తమ తమ ఇళ్లలో త్రిక్కకర అప్పన్‌ (వామనుడు) విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. ఓనం పండుగ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేరళ పడవ పందాలు నిర్వహిస్తారు. సర్పాకారంతో తయారుచేసిన పడవలపై 100మంది వరకూ నావికులు కూర్చుని పంపానదిలో పోటీకి దిగుతారు.

పురాణం

మహాబలి ప్రహ్లాదుని మనుమడు.విరోచనుడు ని కొడుకు. ప్రహ్లాదుడు అసురుడైనప్పటికీ, విష్ణువు పైన గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. మహాబలి చిన్నపిల్లవాడుగా ప్రహ్లాదుని ఒడిలో ఉండగానే విష్ణువుపైన ప్రేమను మరియు భక్తిని అలవరుచుకున్నాడు.

మహాబలి ముల్లోకములను జయించుట

కశ్యపుడుకి ఇద్దరు భార్యలు, దితి మరియు అదితి, వీరు రాక్షసులు మరియు దేవతల (అసురులు మరియు దేవతలు) తల్లితండ్రులు. తపస్సు చేసుకోవటానికి హిమాలయములకు వెళ్ళిన కశ్యపుడు, తిరిగి వచ్చి అదితి శోకిస్తూ ఉండటాన్ని కనుగొంటాడు. దివ్య దృష్టితో కశ్యపుడు వెంటనే ఆమె బాధకు కారణమును కనుగొంటాడు. ఈ ప్రపంచములో దేవుని ఇష్టం లేకుండా ఏదీ జరగదనీ మరియు ప్రజలు వారి విధులు నిర్వర్తిస్తూ ఉండాలని చెపుతూ ఆయన, ఆమెను సమాధాన పరచటానికి ప్రయత్నించాడు. ఆయన, ఆమెకు విష్ణునును పూజించమని చెపుతూ పయోవ్రతమును బోధించాడు, ఇది కార్తీక మాసము యొక్క శుక్ల పక్షములో పన్నెండవ రోజు (శుక్ల-పక్ష ద్వాదశి) నుండి చేయవలసిన క్రతువు. అదితి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించటం వలన, విష్ణువు ఆమెకు దర్శనమిచ్చి తను ఇంద్రునికి సహాయం చేస్తానని ఆమెకు తెలియజేసాడు.

ఇంకొక ప్రక్క, దేవతలను ఓడించి మహాబలి ముల్లోకములకు పాలకుడు అవటంతో దేవతలందరూ చాలా చిరాకు పడ్డారు. దేవతలు హింసించబడ్డారు. దేవతలు విష్ణువును కలిసి సహాయం అర్ధించారు. మహాబలి తన ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు మరియు అతను సురుడు (దేవుడు) అవటానికి అర్హుడు అని విష్ణువు దేవతలతో చెప్పాడు. దేవతలారా మీరు దీని గురించి ఈర్ష్య చెందకండి. అసూయ మిమ్ములను అసురులుగా చేస్తుంది. విష్ణువు మహాబలిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు.

అదే సమయంలో, మహాబలి నర్మదా నది ఒడ్డున విశ్వజిత్ యాగం లేదా అశ్వమేధ యాగం నిర్వర్తిస్తున్నాడు. ఈ యాగం సమయంలో తన వద్ద నుండి ఎవరు ఏమి కోరినా అది తను ఇస్తానని కూడా ఆయన ప్రకటించాడు.
వామనుడు మహాబలిని కలుస్తాడు
బలి చక్రవర్తి (మహాబలి, right seated) ఆస్థానములో భిక్ష కోరుతున్న వామనుడు (నీల వర్ణపు మోము కలిగిన పొట్టివాడు).

ఆ యాగమును మరియు మహాబలి యొక్క ప్రకటనను అదునుగా తీసుకుని, వామనుడు (మహావిష్ణువు బ్రాహ్మణుడిగా మారువేషంలో) ఆ యాగశాల వద్దకు వచ్చాడు. అతను వారిని సమీపించగానే, అక్కడ ఉన్న ఋషులు ఆ చిన్నపిల్లవాని యొక్క దివ్యమైన తేజస్సును కనుగొన్నారు. మహాబలి ఆ బ్రాహ్మణ బాలుని సకల మర్యాదలతో స్వాగతించాడు మరియు ఒక దివ్య పురుషుని హోదాలో అతనిని ఉన్నతాసనములో కూర్చుండబెట్టాడు. సహాయం కోరుతూ వచ్చిన ప్రజలకు ఇచ్చే సాధారణ మర్యాదతో మహాబలి, వామనునితో ఆయన రాకతో తనను పావనం చేయటం తన అదృష్టమని చెప్పాడు. వామనుడు ఏది కోరుకుంటే, అది తీర్చటానికి మహాబలి సిద్ధంగా ఉన్నాడు. వామనుడు చిరునవ్వు నవ్వి ఈవిధంగా చెప్పాడు: "నువ్వు నాకు గొప్పది ఏదీ ఇవ్వనక్కరలేదు. నువ్వు నాకు మూడు అడుగుల భూమిని ఇస్తే చాలు" .

అతని మాటలు విని, భవిష్యత్తును చూడగలిగిన, మహాబలి యొక్క గురువు అయిన శుక్రాచార్యుడు అనే బ్రాహ్మణుడు (ఒక దైత్య గురువు), మహాబలితో అతని వద్దకు భిక్ష కొరకు వచ్చిన వాడు సాధారణ బ్రాహ్మణుడు కాదని విష్ణువే ఈ రూపంలో వచ్చాడని చెప్పాడు. ఆ పిల్లవానికి ఏమీ వాగ్దానం చేయవద్దని ఆయన మహాబలికి సలహా ఇచ్చాడు. కానీ మహాబలి ఎప్పుడూ ఆడిన మాట తప్పే రాజు కాదు, అలా చేయటం పాపమని ఆయన ఉద్దేశ్యం. వామనుని కోరికలను తీర్చకూడదని, ఎందుకనగా వామనుడు అతని సంపదనంతటినీ హరించివేస్తాడని శుక్రాచార్యుడు గట్టిగా చెప్పాడు.
సాంప్రదాయక దుస్తులలో ఉన్న ఒనపొట్టాన్, కేరళ ఉత్తర ప్రాతములలో ఒక ఆచారంఓనం సమయంలో ఒనపొట్టాన్ ఇంటింటికీ తిరిగి దీవెనలు అందిస్తాడు. ప్రస్తుతం ఒనపొట్టాన్ చాలా అరుదుగా అగుపిస్తున్నాడు, కేవలం గ్రామాలకే పరిమితమైనాడు.

వామనుడుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్న మహాబలి, తన గురువు మాటను మన్నించనందుకు ఆయనను క్షమాపణ కోరుకున్నాడు. పూర్వం, మహాబలి ఇంద్రునిపై యుద్ధానికి దండెత్తి వెళుతున్నప్పుడు, తన గురువైన శుక్రాచార్యుని కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసాడు మరియు ఆయన సలహాపైనే విశ్వజిత్ యాగమును ప్రారంభించాడు, దీని నుండే అతను కొన్ని శక్తివంతమైన ఆయుధాలను సంపాదించాడు. కేవలం శుక్రాచార్యుని సహాయం వలనే అతను ఇంద్రుడిని జయించగలిగాడు. మహాబలి తిరస్కారం శుక్రాచార్యునికి ఆగ్రహం తెప్పించింది. ఆయన మహాబలిని ఈవిధంగా శపించాడు: 'నీ గురువు మాటలను లక్ష్య పెట్టనందుకు, నీవు బూడిద అయిపోతావు'. మహాబలి ధృడంగా ఉండి ఈ విధంగా సమాధానం చెప్పాడు: 'నేను ఏ విధమైన పరిణామములను ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ నా మాటను వెనక్కి తీసుకోను'.
మహాబలి యొక్క ఏలుబడి ముగుస్తుంది

ఆ విధంగా చెపుతూ, అతను వామనుడుని అతను కోరుకున్న మూడు అడుగుల భూమిని కొలవమని అడిగాడు. మహాబలిని వారించటానికి శుక్రాచార్యుడు చేసిన ప్రయత్నములన్నీ విఫలమయ్యాయి. తన వద్దకు సహాయం కొరకు వచ్చిన ప్రతిఒక్కరినీ దేవునిగానే మహాబలి భావించాడు మరియు వారు కోరినది ఏదీ అతను కాదనలేదు. మహాబలి తన గురువుతో ఈ విధంగా చెప్పాడు: "ప్రాణము (జీవం) మరియు మానము (మర్యాద) అనేవి మనిషికి రెండు కళ్ళ వంటివి. ప్రాణం పోయినా, మానం రక్షించబడాలి. ఇప్పుడు వచ్చిన వాడు దేవుడే అని తెలుసుకుంటే, మానవులకు అన్నీ ఇచ్చే భగవంతుడు, నా నుండి ఏదో ఆశిస్తున్నాడంటే, నేను చాలా అదృష్టవంతుడిని అవుతాను. " ఒకవేళ విష్ణువే తన క్రతువు వద్దకు వచ్చి ఏదైనా కోరుకుంటే, తను తప్పకుండా దానిని తీరుస్తానని కూడా మహాబలి గొప్పగా చెప్పాడు.

బలిపై విజయం సాధించిన త్రి-విక్రమునిగా (ముల్లోక విజేత) వామనుడు
వామనుడు ఆకాశము కన్నా ఎత్తుకు పెరిగిపోయాడు. ఒక్క అడుగుతో, అతను భూమినంతటినీ కొలిచాడు. రెండవదానితో ఆకాశమును కొలిచాడు. మహాబలి అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఇంకొక అడుగు భూమి ఇంకా మిగిలి ఉంది. వేరే దారి లేకపోవటంతో, మూడవ అడుగు భూమిగా ఆఖరి అడుగును తన తలపై ఉంచవలసిందని మహాబలి వామనుడిని అభ్యర్ధించాడు. వామనుడు అదే విధంగా చేస్తూ, అతనిని పాతాళానికి తొక్కి వేసాడు
(భూమి క్రింద ఉన్న రాజ్యం).--విష్ణువు యొక్క దీవెనలు
రాక్షసుడు అయిన మహాబలి భక్తికి మెచ్చి, విష్ణువు (వామనుడు) అతనికి పాతాళమును పాలించే వరం ఇచ్చాడు. ఒక మన్వంతరం అతను ఇంద్ర పదవిని అధిష్టించే వరం కూడా ఇచ్చాడు, ఆ విధంగా తన భక్తుని కోరికను నెరవేర్చాడు (ప్రతి మన్వంతరమునకు ఒకసారి ఇంద్ర పదవిని కొత్తవారు అధిష్టిస్తారు).

ఆఖరి వరంగా, మహాబలి సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను కలుసుకునేందుకు అనుమతి కూడా పొందాడు. ఆవిధంగా, తన వాగ్దానమును నిలుపుకోవటానికి ప్రతి సంవత్సరము వచ్చే గొప్ప రాజు మహాబలి జ్ఞాపకార్ధం కేరళ ప్రజలు ఓనం పండుగను జరుపుకుంటారు. ఆడిన మాట ("సత్యము") కొరకు ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా మహాబలి తన పేరును సార్ధకం చేసుకున్నాడు. "మహాబలి" అనగా గొప్ప త్యాగము అని అర్ధం.

ఓనం సమయంలో, విందు మరియు చక్కగా ముస్తాబైన ప్రజల యొక్క పండుగ ఉత్సాహం మహాబలి యొక్క మచ్చలేని పాలన సమయంలోని ప్రజల సుసంపన్నమైన మరియు నిజాయితీ అయిన జీవితానికి స్మృతిగా భావిస్తారు. ఓనం సమయంలో ప్రజలు కొత్త దుస్తులు (వస్త్రములు) ధరిస్తారు. 'వస్త్రము' అనగా హృదయము అని కూడా అర్ధం. ఆవిధంగా చెడ్డ ఆలోచనలను మరియు చెడ్డ భావములను తొలగించి హృదయమును నూతనముగా చేయటమే, కొత్త వస్త్రములు ధరించటం యొక్క ప్రాముఖ్యత. వారి మత అభిమానములను ప్రక్కన పెట్టి, ప్రజలందరూ కలిసికట్టుగా పవిత్రమైన 'తిరుఓనం' దినానికి స్వాగతం చెపుతారు.

నైతిక ప్రశ్నలు
తన తాత (ప్రహ్లాదుడు) లాగా, విష్ణువుకు గొప్ప భక్తులలో ఒకడు మరియు సత్యసంధుడైన ఒక గొప్ప రాజు అయిన మహాబలిని, విష్ణువు శిక్షించటం అన్యాయముగా అనిపించవచ్చు. అయినప్పటికీ, విష్ణువు మహాబలిని శిక్షించినట్లు కాదు, ఎందుకనగా అతను విష్ణువు నుండి వరములు పొందాడు మరియు ఓనం రూపంలో అతను శాశ్వతంగా గుర్తుంచుకోబడతాడు. ఇంకా అతని తన తలను విష్ణువు పాదముల క్రింద ఉంచే అవకాశం దొరికింది, దీనితో అతని పాపములు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి.

ఇంకా, విష్ణువు ఇచ్చిన వరం వలన, మహాబలి ఎనిమిదవ మనువు, సావర్ణి మనువు సమయంలో, కాబోయే (ఎనిమిదవ) ఇంద్రుడు. పురందరుడు ప్రస్తుత ఇంద్రుడు.

తన రాజ్యమును విష్ణువుకు త్యాగం చేయటం ద్వారా మహాబలి భూమండలంలో అతి గొప్ప విష్ణు భక్తుడు అయినాడని నమ్మకం.

సురలు అనగా మంచివారు మరియు అసురులు అనగా చెడ్డవారు అని అర్ధం. హిందూమతం ప్రకారం, చెడ్డ పనులు చేయటం ద్వారా సురలు అసురులు అవవచ్చు మరియు మంచి పనులు చేయటం ద్వారా అసురులు సురలు అవవచ్చు. అసురుడైన మహాబలి, సురుడు అవాలని కోరుకున్నాడు. దాని కొరకు, అతను తన ప్రజలకు మంచి పనులు చేసాడు. మహాబలి యొక్క పరోపకారమును మరియు దాతృత్వమును పరీక్షించటానికి మహావిష్ణువు వామనుని రూపంలో వచ్చి అతనిని పాతాళమునకు పంపివేసాడు, దీనిని మహాబలి ఆనందముగా స్వీకరించాడు. ఆవిధంగా, మహాబలి సురుడు లేదా దేవుడు అయినాడు మరియు ఓనం హిందూమతం యొక్క అద్వైత సిద్ధాంతమును దృష్టాంతపరుస్తోంది.
-----------------------------

రాక్షస రాజైన బలి చక్రవర్తి ఓసారి భూమిని ఆక్రమిస్తాడు. దానవుల నుంచి మనుషులను కాపాడటానికి విష్ణుమూర్తి వైకుంఠాన్ని, లక్ష్మీదేవిని వదిలి భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణపౌర్ణమి రోజు బలి చక్రవర్తి చేతికి పవివూతదారాన్ని కట్టి, తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మనుషులకు విముక్తి కలిగిస్తాడు. విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.
  • =====================================
Visit my Website at - > Dr.Seshagirirao.com/

Saturday, November 2, 2013

Pot desire - కుండ కోరిక

  •  

  •  

కుండ కోరిక

కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు. ఓర్పుతో, నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతిలో మలిచాడు. వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేశాడు. అప్పటికే కాలుతున్న కొన్ని కుండలని చూసి పచ్చి కుండల్లో ఒకదానికి చాలా భయం వేసింది. 'అమ్మో! ఒళ్లు కాలిపోవడమే? వద్దు. దయచేసి నన్ను కాల్చొద్దు. నన్నిలా వదిలెయ్‌. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు. నాకు భయంగా ఉంది' అని కుమ్మరిని దీనంగా బతిమాలింది. కుమ్మరి కుండతో 'జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృథా అవుతుంది. సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతావు' అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పాడు. అతడు ఎంత చెప్పినా వినకుండా కుండ మొండికేసింది. సరే... అంతలా అడుగుతోంది పోనిమ్మని కుమ్మరి ఈ కుండని వదిలేసి మిగిలిన కుండలను ఆవంలో పెట్టాడు. ఆవంలో కాలుతున్న కుండలని చూస్తూ తనకి ఆ అవస్థ తప్పినందుకు, ఆనంద పడుతూ, 'నాకా బాధలు లేవు, హాయిగా ఉన్నాను' అనుకుంది ఆ పచ్చి కుండ. బాగా కాలిన ఎర్రని, నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చి కుండ మాత్రం ఆరుబయట ఆవరణలో అలా ఉండిపోయింది. కుమ్మరి ఒక కుండలో నీళ్లు నింపాడు. కొన్ని కుండీలలో మట్టి నింపి మొక్కలు నాటాడు. తనకా బరువులు లేనందుకు ఆనందించిందా పచ్చి కుండ. ఇలా ఉండగా ఓ రోజు కుండపోతగా వర్షం కురిసింది. కాల్చిన కుండలూ, కుండీలూ దృఢంగా అలాగే ఉంటే ఈ పచ్చికుండ మాత్రం మెల్లిగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది. తన ఆకృతిని, ఉనికిని కోల్పోయింది. కుమ్మరి మాటల్లో అంతరార్థం దానికి చివరిక్షణంలో బోధపడింది. కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది.
- గుడిపూడి రాధికారాణి


  • =====================================
Visit my Website at - > Dr.Seshagirirao.com/